calender_icon.png 12 December, 2024 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనంలో పురుగులు

12-12-2024 01:40:38 AM

జిన్నారం (గమ్మడిదల), డిసెంబర్ 11: గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పురుగులు దర్శనమిచ్చాయి. విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానిక నాయకులకు తెలపడంతో.. వారు స్కూల్ వద్దకు చేరుకొని ఉపాధ్యాయులను నిలదీశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ వార్డు సభ్యుడు ఫయాజ్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నంపై  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.