calender_icon.png 30 November, 2024 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనంలో ‘పురుగులు’

30-11-2024 02:11:23 AM

కామారెడ్డి జిల్లాలో అధికారుల మొద్దు నిద్ర 

కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా నాణ్య త లోపించిన బియ్యాన్ని వండి వడ్డిస్తుండడంతో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు మృతి చెందుతున్న ఘటనలు తరచూ జరుగు తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రం లోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం వండిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థినులకు వడ్డించగా అందులో పురుగులు దర్శనమిచ్చాయి.

ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ వద్దకు చేరుకొని ఉపాధ్యాయులను నిలదీశారు. ఎంఎల్ ఎస్ పాయింట్ నుంచి బియ్యం వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆరోపించడంతో వాగ్వాదం మరింత ముదిరింది.

ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పాఠశాలకు  వచ్చి పరిశీలించారు. పురుగులతో కూడిన 5 క్వింటాళ్ల బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఎం ఈవో మాట్లాడుతూ.. అన్నం వండే ముందు బియ్యాన్ని పరిశీలించాలని ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజ నం నిర్వాహకులకు సూచించారు. అయితే విషయం కాస్తా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారిని సమాధానం కోరినట్టు సమాచారం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంఈవో నచ్చజెప్పడంతో వివాదం సద్దు మణిగింది.