calender_icon.png 29 November, 2024 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌరసరఫరాల శాఖమంత్రి సొంత జిల్లాలో మధ్యాహ్న భోజనానికి పురుగుల బియ్యం

29-11-2024 05:06:59 PM

నియోజకవర్గాలలో పురుగుల అన్నం తింటున్న పాఠశాల విద్యార్థులు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన స్థానిక బిఆర్ఎస్ నేతలు.

మునగాల (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందించే భోజనం విషతుల్యమై పదుల సంఖ్యలో విద్యార్థులు మరణించడం, వేలమంది విద్యార్థులు అనారోగ్యానికి గురికావడానికి రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంమే కారణమని బిఆర్ఎస్ మునగాల పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల నందు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని వారు స్థానిక పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థిని మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు భోజనంలో పురుగులు వస్తున్నాయని ద్వారా తమ ఆరోగ్యానికి గురవుతున్నామని తెలపడం జరిగింది.

అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దంపతులు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో విద్యార్థులకు అందించే రేషన్ బియ్యం పూర్తిగా పురుగుల మయంగా ఉన్నాయని తద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత వాంతులు విరోచనాలు కడుపులో నొప్పి లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా కూడా సివిల్ సప్లై ద్వారా పంపిణీ చేస్తున్న పురుగుల బియ్యం మూలంగానే విద్యార్థులకు అనారోగ్య సమస్య తలెత్తుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గత పది నెలలుగా విద్యార్థులకు అందిస్తున్న బియ్యం నాణ్యతగా లేకపోవడం సమస్యకు కారణమైతే రాష్ట్ర మంత్రులు అడ్డగోలుగా ప్రస్తుత గురుకుల పాఠశాల, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అస్తవ్యస్తతకు బిఆర్ఎస్  కుట్ర చేస్తుందని  విమర్శించడం సరైనది కాదని వారన్నారు.

ప్రస్తుత విద్యార్థుల మరణాల సమస్యకు భోజనం తయారు చేసే కార్మికుల్ని, ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యులు చేయడం వారిపై చర్యలు తీసుకుంటామన్నడం సమంజసం కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎనిమిది నెలల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, పురుగులు లేకుండా నాణ్యతతో కూడిన సన్నబియాన్ని మధ్యాహ్నం పథకం కోసం విద్యార్థులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునగాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్పి రామయ్య, చీకటి శీను, నవీన్ రెడ్డి, వసంత కుమార్, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.