calender_icon.png 10 April, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలికి వరల్డ్ వాటర్ అవార్డు

03-04-2025 12:00:00 AM

బెస్ట్ ఎస్టీపీ కేటగిరీలో నాగోల్ గుర్తింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ జలమండలికి వరల్డ్ వాటర్ అవార్డు దక్కింది. వాటర్ డైజెస్ట్ అనే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 2024 సంవత్సరానికి యునెస్కో భాగస్వామ్యంతో నిర్వహించిన 19వ వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డ్స్‌లో బెస్ట్ ఎస్టీపీ ప్రభుత్వ కేటగిరీలో జలమండలికి అవార్డు లభించింది.

నాగోల్‌లోని 320ఎంఎల్‌డీల సామర్థ్యం గల పర్యావరణ అనుకూలమైన ఎస్టీపీతో సమర్ధవంతంగా మురుగునీటిని శుద్ధి చేస్తూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో విశేష ప్రాముఖ్యతను చూపినందుకు ఈ అవార్డుకు ఎంపికైంది. అలాగే అధునాతన నీటి నిర్వహణ, సర్క్యులార్ ఎకానమీ విధానాలు, మురుగు నీటి పునర్వినియోగం వంటి అంశాలలో చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.

బుధవారం జలమండలి ప్రధా న కార్యాలయంలో ఎండీ అశోక్‌రెడ్డికి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ 1 సుదర్శన్ ఈ అవార్డును అందజేశారు. జలమండలికి అవార్డు దక్కడం పట్ల ఎండీ అశోక్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా  మార్చి 31న ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రధాన కార్యక్రమంలో జలమండలి ఈడీ మయాంక్‌మిట్టల్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ 1 సుదర్శన్‌లు అందుకున్నారు.

ఈ సందర్భంగా జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ హైదరా బాద్ నగరంలో అందరికీ తాగు నీరు అం దించడంతో పాటు.. ఉత్పన్నమయ్యే మురుగును శుద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.  కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ సీజీఎంలు పద్మజ, సుజాత, జీఎం కుమార్, డీజీఎం నిరుపమ మేనేజర్లు పాల్గొన్నారు.