25-03-2025 12:00:00 AM
మంచిర్యాల, మార్చి24 (విజయక్రాంతి): ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా ప్రోగ్రాం అధికారి సురేందర్, డిపిఎం ఓ ప్రశాంతి, డెమో బుక్క వెంకటేశ్వర్, హెచ్‌ఈఓ నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పద్మ తదితరులు పాల్గొన్నారు.