24-03-2025 02:39:25 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ... టీబీ వ్యాధి తుంపర్ల, గాలి ద్వారా ఒకరి నుండి ఒకరి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. టీబీ వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించి పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధి నిర్ధారణాయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు వాడితే పూర్తిగా నయమవుతుందని తెలిపారు. వ్యాధి లక్షణాలు వారం పాటు ఎడతెరపి లేకుండా తెమడతో దగ్గు, సాయంత్రం వేళ జ్వరం, ఆకలి మందగించటం, బరువు కోల్పోవడం, ఆయాసం, ఛాతీలో మంట వీటిలో ఒకటి, రెండు లక్షణాలు ఉన్నట్లయితే ల్యాబ్ ద్వారా లేదా ఎక్స్ రే ద్వారా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి బారిన పడిన వారు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని, మందులు సక్రమంగా వాడాలని వెల్లడించారు. భారత దేశం నుండి 2030వ వరకు టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరోగ్య విస్తరణ అధికారి బి.భాస్కర్ రాజు సూపర్వైజర్, బి జయమ్మ నర్సింగ్ ఆఫీసర్ సునీత, ల్యాబ్ టెక్నీషియన్ ఫణీంద్ర పాల్గొన్నారు.