ఆదిలాబాద్/కామారెడ్డి/మంచిర్యాల/కుమ్రంభీం ఆసిఫాబాద్/నిర్మల్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసీ దినోత్స వాన్ని శుక్రవారం ఆదివాసీలు ఘనంగా జరుపుకొన్నారు. ఉట్నూర్‌లో వేడుకలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజరిషా, ఎస్పీ గౌస్ ఆలం హాజర య్యారు. ఆదివాసీలు సంప్రదాయ వాయిద్యాలతో భారీ ర్యాలీ నిరహించారు. కొము రంభీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్ మండలం గునుకుల్, తునికిపల్లి గ్రామాల్లో ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గం హన్మాజీపేట్ గ్రామంలో నాయకపోడు సం ఘభవన ఆవరణలో జెండాను ఎగురవేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, కలెక్టర్ వెంకటేష్ దోత్రే వేడుకల్లో పాల్గొన్నారు. నిర్మల్‌లో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.