calender_icon.png 23 February, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కౌట్స్ ఆధ్వర్యంలో వరల్డ్ థింకింగ్ డే

22-02-2025 10:52:18 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని పీవీ కాలనీ సింగరేణి పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వరల్డ్ థింకింగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏరియా సింగరేణి డీజీఎం పర్సనల్ ఎస్ రమేష్, వరల్డ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు రాబర్ట్ బార్డెన్ పావని(World Scouts and Guides Founder Robert Baden-Pavani) చిత్రపటానికి పూలమాలవేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ మతాకాన్ని ఆవిష్కరించారు. స్పోర్ట్స్ అండ్ గైడ్స్ విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణీలతో కలిసి డీజిఎం పర్సనల్ రమేష్ సర్వమత ప్రార్థన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్నేహభావంతో సేవా దృక్పథంతో జాతి సేవకు అంకితమయ్యేందుకు సౌండ్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని స్థాపించిన పావెల్ దూర దృష్టితో ప్రపంచ మానవజాతికి చేసిన సేవకు గాను ఆయన జన్మదినాన్ని వరల్డ్ థింకింగ్ డే గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రమశిక్షణతో శిక్షణ పొందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ అలవర్చుకోవడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని, ఆపద సమయాల్లో ధైర్యసహసాలు చూపడం ప్రత్యక్షంగా సమాజానికి, పరోక్షంగా దేశానికి సేవలందించడం అభినందనీయమన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహించిన శాంతి యాత్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కెప్టెన్ సరిత, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.