28-03-2025 09:02:10 PM
మందమర్రి,(విజయక్రాంతి): ప్రపంచ తలసీమియా దినోత్సవం మే 8 న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని కాశీమియా సికిల్ సెల్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు పెరిగి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో ప్రతి వంద మందిలో ఐదుగురు తల సేమియా సికిల్ సెల్ వ్యాధి వాహకులు ఉన్నారని, వాహకులు పెళ్లి చేసుకుంటే పుట్టబోయే సంతానము 50 శాతం నార్మల్ పిల్లలు, 25% వ్యాధి వాహకాలు, 25% వ్యాధిగ్రస్తులు జన్మిస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వ్యాధిగ్రస్తులు ప్రతి సంవత్సరము ఐదు నుంచి 600 మంది జన్మిస్తున్నారని, ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వము పెళ్లికి ముందు యువతి యువకులకు విద్యార్థిని విద్యార్థులకు హెచ్బిఏ 2 వైద్య పరీక్ష రక్త పరీక్ష అలాగే ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా హెచ్బీఏ 2 రక్త పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏర్పాటు చేసినట్లుగా తల సేమియా సికిల్ సెల్ కంట్రోల్ సొసైటీని ఏర్పాటు చేసి వ్యాధిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి మే 8 ప్రపంచ తలసిమ్య దినమును పురస్కరించుకొని అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.