* డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం
* ఐరాస వేదికగా శ్రీశ్రీ రవిశంకర్ ధ్యానం
* ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న 85 లక్షల మంది
బెంగళూరు, డిసెంబర్ 22: ప్రపంచ ధాన్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ‘వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్’ కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ యూనియన్‌లో చోటు సంపాదించి చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఆర్డ్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ చారిత్రాత్మక కార్యక్ర మంలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 85 లక్షల మంది పాల్గొన్నారు. ఐక్యత కు, అంతర్గత శాంతికి అసమానమైన వేడుకగా మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం నిలిచింది. 180కి పైగా దేశాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారమైన గైడెడ్ ధ్యాన కార్యక్రమాలకు అత్యధిక వ్యూస్ లభించాయి.