calender_icon.png 23 December, 2024 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొడవైన జుట్టుతో ప్రపంచ రికార్డు!

23-07-2024 12:00:00 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్మితా శ్రీవాస్తవ, ప్రపంచంలోనే అత్యంత పొడవాటి జుట్టు కలిగి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని అల్లాపూర్‌లో నివస్తున్న 46 ఏళ్ల స్మితా శ్రీవాస్తవ జుట్టు పొడవు 236.22 సెంటీమిటర్లు అంటే ఏడు అడుగుల తొమ్మిది అంగుళాలు. 

స్మితా శ్రీవాస్తవకు చిన్నప్పటి నుంచి జుట్టును అందంగా పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆమె జుట్టు చాలా మందంగా, పొడవుగా ఉండేది. జుట్టు పెంచుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. “వాటిలో ఒకటి వాళ్ల అమ్మమ్మ.. అక్కా, రెండోది 1980 హిందీ సినిమాల” ప్రభావం తనపై ఎక్కువగా ఉందని చెబుతున్నది. అలా అభిరుచిని కొనసాగించడం ప్రారంభిచింది. 

తలస్నానం.. 

స్మితా జుట్టు కడుక్కోవడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జుట్టు దువ్వుకోవడానికి స్టూల్ లేదా టేబుల్ సహాయం కూడా తీసుకుంటుంది. ఆమె తలస్నానం వారానికి రెండుసార్లు చేస్తుంది. తలస్నానం చేయడానికి 30 నుంచి 35 నిమిషాల సమయం పడుతుంది. 

జుట్టు వేసుకునే సమయం.. స్మితా జుట్టు కడగడానికి నేలపై ఒక షీట్ వేస్తుంది. ఆ తర్వాత ఆమె మంచం మీద నిలబడి తన జుట్టును దువ్వుకుంటుంది. జడ వేసుకునే ముందు దువ్వుకోవడానికి మూడు గంటల సమయం పడుతుంది. 

జుట్టు పెంచడానికి కారణం.. 

జుట్టు పెంచడానికి తల్లి, సోదరిని రోల్ మోడల్‌గా తీసుకున్నారు. అదే విధంగా 80లలో చాలామంది బాలీవుడ్ నటీమణుల పొడవాటి జుట్టు ఆమెను ఆకర్షించింది. స్మితాకు ఇష్టమైన నటి మాధురీ దీక్షిత్. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని జుట్టు పొడుగ్గా పెంచుకున్నారు. స్మితా 32 సంవత్సరాలుగా ఎప్పుడూ జుట్టు కత్తిరించుకోలేదు. జుట్టును అలంకరించుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఆమె అభిరుచిని నెరవేర్చడంలో భర్త, కుటుంబ సభ్యులు ఆమెకు పూర్తి మద్ధతు ఇచ్చారు. అత్యంత పొడవాటి జుట్టు ఉన్నవ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో తన పేరు నమోదు కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 

రికార్డులు.. 

పొడవాటి జుట్టు కారణంగా స్మిత ఎన్నో అవార్డులను అందుకుంది. ఆమె అనేక వేదికలపై అనేకసార్లు సన్మానం కూడా పొందింది. అంతకుముందు 2012లో లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆమె పేరు నమోదైంది. ఢిల్లీలో అత్యంత పొడవాటి జుట్టుతో ర్యాంప్ వాక్ కూడా చేశారు.