ISS: అంతరిక్ష యాత్ర ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యువతీ యువకుల కల.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలొ పలువురు ఆస్ట్రోనాట్లు అంతరిక్ష యాత్రలో పాల్గొంటున్నారు. వివిధ దేశాల అధికారిక ఆస్ట్రోనాట్లు కాకుండా.. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రైవేటుగా తీసుకెళ్లిన నలుగురు పర్యాటకులు కూడా .అంతరిక్షంలో హల్ చల్ చేస్తున్నారు. అంతరిక్ష యాత్రకు ఇప్పటికి వెళ్లనవారు ప్రపంచ జనాభాతో పోలిస్తే అత్యంత స్వల్పం. అందులోనూ గరిష్ఠంగా ఐదారుగురు వెళ్లి రావడమేగానీ.. ఒకేసారి ఎక్కువ మంది అంతరిక్షంలో ఉన్నది చాలా అరుదైన సంఘటన గురువారం నమోదైంది. ఈ రోజున ఒకే కాలంలో 19 మంది అంతరిక్షంలో భూమిని చుట్టేస్తున్నారు.
ఐఎస్ఎస్ లోనే 12 మంది..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో ఇప్పటికే ఏడుగురు పనిచేస్తున్నారు. ఇటీవల సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరితో కలసి 9 మంది అయ్యారు. బుధవారమే (సెప్టెంబర్ 11న) అంతరిక్ష కేంద్రానికి.. ఒక అమెరికన్ ఆస్ట్రోనాట్, ఇద్దరు కాస్మోనాట్లు,( రష్యా వ్యోమగాములు) వెళ్లారు. వీరితో కలిపి ఐఎస్ఎస్ లో ఉన్నవారి సంఖ్య 12కు చేరింది.
చైనా స్పేస్ స్టేషన్ లో ముగ్గురు
చైనాకు చెందిన టియాంగోంగ్ స్పేస్ స్టేషన్ లో ఆ దేశానికి చెందిన ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. వీరితో కలిపి 15 మంది అయ్యారు.
స్పేస్ ఎక్స్ ప్రైవేట్ మిషన్తో..
దేశాల అధికారిక ఆస్ట్రోనాట్లు కాకుండా.. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రైవేటుగా తీసుకెళ్లిన నలుగురు పర్యాటకులు కూడా గురువారం నాడు స్పేస్ లో కలియదిరిగారు. స్పేస్ ఎక్స్ పోలారిస్ డాన్ మిషన్ లో అంతరిక్షంలోకి వెళ్లిన వారు.. స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలో ఎప్పుడూ ప్రైవేటు వ్యక్తులు స్పేస్ వాక్ చేయలేదు. ఇదే మొదటిసారి. ఈ నలుగురితో కలిసి ఒకే సమయంలో స్పేస్ లో ఉన్నవారి సంఖ్య 19కి చేరింది.
ఇంతకుముందెప్పుడూ వెళ్లలేదా?
ఇంతకుముందు 2023 మేలో ఒకే సమయంలో 17 మంది స్పేస్ లో ఉన్న ఘటన జరిగింది. అప్పట్లో కూడా ఐఎస్ఎస్ లో, చైనా స్పేస్ స్టేషన్ లో ఉన్నవారితోపాటు వర్జిన్ గెలాక్టిక్, ఆక్సియం స్పేస్ సంస్థలు ఒకే సమయంలో స్పేస్ ప్రయోగాలు చేపట్టడం దానికి కారణమైంది.