calender_icon.png 28 December, 2024 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతకాల పంట వరల్డ్ పికిల్ బాల్ టోర్నీ

07-12-2024 12:30:16 AM

న్యూఢిల్లీ: హాంగ్ కాంగ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ పికిల్ బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాలతో సత్తా చాటింది. ఇప్పటివరకు టోర్నీలో ఆరు పతకాలు రాగా.. ఇందులో ఒక స్వర్ణం సహా మూడు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. 19 ప్లస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో వంశిక్ కపాడియా, వృశాలీ థాకరే స్వర్ణం నెగ్గగా.. కుల్దీప్ మహజన్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో రజతం గెలుచుకున్నాడు.

పురుషుల సింగిల్స్‌లో వంశిక్ కపాడియా, మహిళల డబుల్స్‌లో కరీనా ఆదిత్య థాకరే జోడీ రజతాలు సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో ఇషా లకానీ వాన్ రీక్ కాంస్యం గెలవగా.. ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మయుర్ పాటిల్ కాంస్యం నెగ్గాడు. నవంబర్‌లో జరిగిన లెగ్ పికిల్ బాల్ చాంపియన్‌షిప్‌లో 28 మెడల్స్ కైవసం చేసుకుంది.