calender_icon.png 12 January, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గో సంరక్షణతో ప్రపంచశాంతి

30-12-2024 03:13:58 AM

అయోధ్య రామమందిర్ ట్రస్టు కోశాధికారి దేవగిరిజీ మహరాజ్

పటాన్‌చెరు, డిసెంబర్ 29: గో సంరక్షణతో ప్రపంచ శాంతి లభిస్తుందని అయోధ్య రామ మందిర్ ట్రస్టు కోశాధికారి గోవిందా దేవగిరిజీ మహరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్  పట్టణం బీరంగూడలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి గోశాల 14వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన గోవిందా దేవగిరిజీ మహరాజ్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ గో సంపదను రక్షించేందుకు ముందకు రావాలన్నారు. గోవును రక్షిస్తే ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందన్నారు.కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రవీందర్, రమేశ్, మండల అధ్యక్షుడు రాజు, నాయకులు రఘునాథ్‌రెడ్డి, మాణిక్‌యాదవ్, ఆగారెడ్డి, గోశాల చైర్మన్ సోహన్‌లాల్, అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విఠల్, ఉపాధ్యక్షులు సుఖుదేవ్‌జోషి తదితరులు పాల్గొన్నారు.