28-04-2025 12:51:52 AM
- మత విద్వేషాలను సృష్టించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- పహల్గామ్ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
- రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్
మహబూబ్ నగర్ ఏప్రిల్ 27 (విజయ క్రాంతి) : ప్రపంచ శాంతి ప్రధాన లక్ష్యంగా భారతదేశం ముందుకు సాగుతుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. ఆదివారం అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ పర్యాటకుల మీద ఉగ్రవాద దాడికి నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ భవనంలోని ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సదర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ ప్రపంచంలో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఈ పహల్గాం ఉగ్ర దాడికి ఉలిక్కిపడిందన్నారు. టూరిస్ట్ లను మతం పేరు చెప్పి చంపడం దారుణం అన్నారు. యావత్ ప్రపంచం ఈ ఘటనను తీవ్రంగా ఖండించిందన్నారు. కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిని ఆసరాగా చేసుకుని దేశంలో మత విద్వేషాలను సృష్టించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సమాజాన్ని విడదీయాలని ఆలోచనలు చేసే ఉగ్రవాదులను కట్టడిచేయాలన్నారు. టెర్రరిస్ట్ విముక్తభారత్ దిశగా పనిచేయాలని తెలియజేశారు. అనంతరం తెలంగాణ చౌరస్తా నుండి అంబేద్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ గారు, ఏఐపీఎస్‌ఓ జిల్లా అధ్యక్షులు ఖలీల్, మహమ్మద్ హనీఫ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.