calender_icon.png 26 April, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం

25-04-2025 11:12:00 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించిన డాక్టర్ వినయ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 2030 వరకు మలేరియా నిర్మూలన దిశగా మనమందరం పనిచేయాలని పిలుపునిచ్చారు. దోమ పుట్టకూడదు-దోమ కుట్టకూడదు అనే నినాదంతో ప్రతి మంగళవారం శుక్రవారం డ్రై డే దినోత్సవాన్ని పాటించాలని సిబ్బందికి తెలిపారు.

ఏదైనా జ్వరం వచ్చినచో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలోఆరోగ్య విస్తరణ అధికారి బి భాస్కర్ రాజు సూపర్వైజర్ బి జయమ్మ నర్సింగ్ ఆఫీసర్ సునీత హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ ల్యాబ్ టెక్నీషియన్ ఫణీంద్ర ఏఎన్ఎంలు కే పద్మ. బి పద్మ. ఆశాలు జ్యోతి. రమణ. భాగ్య లక్ష్మి పాల్గొన్నారు.