calender_icon.png 8 April, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

07-04-2025 08:54:47 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రేపాల ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని కలకోవ గ్రామంలో ఆరోగ్యానికి ఉపకేంద్రం నందు ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం లు నాగమణి నరసమ్మలు మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 సంవత్సరానికి తల్లి, బిడ్డల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి ఈ సంవత్సరం అంతా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్యం వ్యక్తులకే కాక మొత్తం సమాజ శ్రేయస్సుకు ఆధారమని, ఆరోగ్యకరమైన తల్లి ఆరోగ్యకరమైన తరానికి జన్మనిస్తుందని అన్నారు.

ప్రజలు తమజీవన శైలిలో ఆహారపు మార్పులను చేసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని సంపాదించుకొని సంతోషంగా జీవించవచ్చు అన్నారు. వేసవికాలంలో ఎక్కువ వాటర్ తీసుకోవాలని ఎండలకు ఎక్కువ దూరప్రయాణాలు చేయకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి దొంగరి సైదులు, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు, ఏఎన్ఎంలు మొగిలిచర్ల నాగమణి, మెడసిన మెట్ల నర్సమ్మ, అంగన్వాడీ టీచర్ ముదిగొండ లలిత, ఆశావర్కర్ మరియమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు కుంభజడ నాగమ్మ, స్వేరో మండల అధ్యక్షులు గద్దల మోహన్ కుమార్, మునగలేటి మహేందర్, మునగలేటి విగ్నేష్, స్వీపర్ మైసమ్మ తదితరులు పాల్గొన్నారు.