calender_icon.png 22 March, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవజాలం మనుగడకు అడవులే ఆధారం

22-03-2025 12:34:20 AM

సమతుల్యత లోపించడంతో విపత్తులు

వార్మింగ్‌తో కఠిన సమస్యలు ఎదుర్కొంటున్నాం

రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): భూవిస్తీర్ణానికి అనుగుణంగా అడవుల విస్తరణ లేకపోవడంతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కఠిన సమస్యలు ఎదుర్కొంటున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. హైదరాబాద్ కేబీఆర్‌పార్క్‌లో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మిస్ వరల్డ్  క్రిస్టినా పెస్కోవాతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. జీవజాలం మనుగడకు అడవులే ఆధారమని పేర్కొన్నారు. ప్రజలు తమ స్వలాభం కోసం అడవులను నాశనం చేస్తూ, తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసుకొంటున్నారని చెప్పారు. ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వనమహోత్సవం పేరిట అడవుల సంరక్షణ కోసం పెద్దఎత్తున కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. కార్యక్రమంలో భాగస్వాములైన మిస్ వరల్డ్ క్రిస్టినా పెస్కోవా,  అటవీ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, ప్రజలకు మంత్రి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.