calender_icon.png 19 January, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచంలో తొలి సీఎన్‌జీ స్కూటర్

19-01-2025 12:14:37 AM

ఆవిష్కరించిన టీవీఎస్

న్యూఢిల్లీ, జనవరి 18: ప్రపంచంలో సీఎన్‌జీ గ్యాస్‌తో నడిచే తొలి స్కూటర్‌ను దేశీయ ద్విచక్ర వాహన కంపెనీ టీవీఎస్ తీసుకురానుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ‘టీవీఎస్ సీఎన్‌జీ 125’ స్కూటర్‌ను కంపెనీ ఆవి ష్కరించింది. ఈ స్కూటర్‌కు 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 1.4 కేజీల సీఎన్‌జీ సిలిండర్‌ను సీట్ కింద అమర్చారు.

రెండూ కలిపి 226 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొ ంది. సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన ఇంజిన్ గంటకు 80.5 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌ను ఇస్తుంది.  ఒక బటన్‌ను టచ్‌చేయడం ద్వారా సీఎన్‌జీ, పెట్రోల్ మోడ్స్‌లోకి మార వచ్చు. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ తర్వాత మార్కెట్లోకి వస్తున్న రెండో బయోఫ్యూయల్ ద్విచక్రవాహనం జూపిటర్ సీఎన్‌జీ.