* తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సీఎండీ మోహన్ శ్యామ్‌ప్రసాద్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి): ఢిల్లీలోని ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్‌లో జరిగిన అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి- కేంద్రీకృత వాణిజ్య ప్రదర్శనలలో ప్రతిష్టాత్మకమైన ఇండస్ ఫుడ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ప్రామాణికమైన, నాణ్యమైన వంట అవసరాలకు నిలయంగా మారింది. ఈ ఎక్స్‌పోలో 20 దేశాలకు చెందిన 1800 మంది ఎగ్జిబిటర్‌లు పాల్గొన్నారు.
దాదాపు 5వేలకు పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు ఎక్స్‌పోను సందర్శించారు. కార్యక్రమంలో తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సీఎండీ మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామీణ ఆహారంలో నాణ్యత, సాంప్రదాయ విలువలను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం కోసం ఈ ఎక్స్ పోలో పాల్గొన్నట్టు తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధత, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ డబుల్ హార్స్ మెటీరియల్‌ను నాణ్యవంతంగా తయారు చేస్తున్నామన్నారు.