చెస్‌లో దివిత్‌రెడ్డి సంచలనం
హైదరాబాద్ కుర్రాడిపై గుకేశ్ ప్రశంసలు
మోంటెసిల్వానో (ఇటలీ): హైదరాబాద్‌కు చెందిన దివిత్ రెడ్డి చదరంగంలో సంచలనం సృష్టించాడు. అండర్-8 వరల్డ్ క్యాడెట్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి దివిత్ చాంపియన్‌గా అవతరించాడు.11 రౌండ్లు ముగిసేసరికి దివిత్‌తో పాటు సాత్విక్ (భారత్), జిమింగ్ గువో (చైనా) తలా 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
అయితే మెరుగైన టై బ్రేక్ స్కోరు కారణంగా దివిత్‌కు తొలి స్థానం దక్కింది. ప్రస్తుతం దివిత్ ఖాతాలో 1784 ఫిడే రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 8 ఏళ్లకే చాంపియన్‌గా నిలవడంపై దివిత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ దివిత్ ప్రదర్శనపై స్పందించాడు.
‘దివిత్ ఒక అద్భుతం. అతని ఉన్న స్కిల్స్ చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. భవిష్యత్తులో మేటి గ్రాండ్‌మాస్టర్‌గా నిలుస్తాడు’ అని పేర్కొన్నా డు. కాగా రెండేళ్ల క్రితం హైదరాబాద్ వేదికగా ఎగ్జిబిషన్ చెస్ ఈవెం ట్ నిర్వహించారు. ఈ టోర్నీలో గుకేశ్, అర్జున్ ఇరిగేసి కూడా పాల్గొన్నారు.