మునగాల, ఫిబ్రవరి 4 : రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు విచ్చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ. గుట్కా పాన్ పరాగ్ పొగాకు సంబంధించిన పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుందని అలాంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు.
ఫిబ్రవరి 10వ తారీఖు న నులి పురుగుల నివారణ దినోత్సవం ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లలకు స్కూళ్లలో అంగన్వాడీ కేంద్రాలలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రల పంపిణీ జరుగుతుందని అందరూ తల్లిదండ్రులు వీటికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్ ఆరోగ్య విస్తరణ అధికారి బి భాస్కర్ రాజు ఎన్సిడి కోఆర్డినేటర్ సాంబశివరావు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లింగారెడ్డి ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు.