calender_icon.png 18 April, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ అందాల పోటీలను రద్దు చేయాలి

10-04-2025 07:57:42 PM

తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్..

కాటారం (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో మే 7 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి(మిస్ వరల్డ్) పోటీలను రద్దు చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధికార ప్రతినిధి ఆకుల లలిత డిమాండ్ చేశారు. గురువారం పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమల, రంగవల్లి, స్వర్ణక్క, బెల్లి లలిత లాంటి వీరనారిమణులకు పుట్టినిళ్ళు లాంటి తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించడం శోచనీయమని అన్నారు.

ఎంతో పోరాట చరిత్ర గల తెలంగాణలో ఈ అందాల పోటీలను మహిళ లోకం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కూటికి లేని నిరుపేద మహిళల్లో కూడా అందం పట్ల శ్రద్ధను పెంచి వారీ చేత కాస్మోటిక్స్, పౌడర్లు, మేకప్ సామాన్లు కొనిపించాలని చూస్తున్నారని విమర్శించారు. పురుషుల శ్రమ మద్యం పాలైతే, మహిళల శ్రమ సౌందర్య సరుకుల పాలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.