calender_icon.png 26 December, 2024 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవ ర్యాలీ

01-12-2024 06:29:55 PM

గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణ ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, ప్రభుత్వ వైద్య సిబ్బంది ర్యాలీలో పాల్గొని ఎయిడ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎంఎ గజ్వేల్ అధ్యక్షులు నాగమున్నయ, వైద్యులు డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ పెంటాచారిలు మాట్లాడుతూ.. ఎక్కువ లైంగిక సంపర్కాల ద్వారా, హెచ్ఐవి రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

HIV సోకిన వ్యక్తిలో రోగ నిరోధక శక్తి తగ్గి అనేక రకాల రోగాలు వస్తాయి దీన్నే ఎయిడ్స్ అంటారన్నారు. HIV సోకిందని అనుమానం ఉన్న వాళ్ళు వెంటనే దగ్గర్లోని ART center లో పరీక్ష చేసుకొని, ఒక వేళ పాజిటివ్ వస్తే, డాక్టర్స్ సలహా మేరకు అందుబాటులో వున్న అంటి రిట్రో వైరల్ మందులతో సాధారణ జీవితం గడపవచ్చని తెలియచేశారు. ప్రతి ఒక్కరు పెళ్ళికి ముందు వదువు, వరుడు తప్పకుండా హెచ్ ఐ వి పరీక్ష చేసుకొన్న తరువాతే పెళ్ళి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు చంద్రారెడ్డి, సాయినాథ్ రెడ్డి, IMA గజ్వేల్ వైద్యులు, గజ్వేల్ గవర్నమెంట్ వైద్యులు, లయన్స్ క్లబ్ స్నేహ మెంబెర్స్ పాల్గొన్నారు.