12-03-2025 12:43:19 AM
కొత్తపల్లి, మార్చి 11: శాతవాహన విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగంలో ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. డిగ్రీ స్థాయిలో రసాయన శాస్త్ర సబ్జెక్టు బోధించే ఫ్యాకల్టీకి ‘రీఇన్ఫోర్స్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రొసీజర్స్ ఇన్ కెమిస్ట్రీ‘ అను అంశంపై వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ ఆచార్య పీ.వీరసోమయ్య (ఉస్మానియా), డా. కోటేష్ పాల్గొని రసాయన శాస్త్రంలోని వివిధ రకాల మెలకువలను వివరించారు.
కన్వీనర్ డా. సరసిజ, కో కన్వీనర్ డా. నమ్రత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి వర్క్ షాప్స్ మరెన్నో నిర్వహించాలని, అధ్యాపకులు వర్క్ షాప్ ని వినియోగించుకొవలని అన్నారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్ మాట్లాడుతూ కార్యశాల వల్ల నైపుణ్యలు పెంచుకోవచ్చని ఈ వర్క్ షాప్ ను నిర్వహించిన రసాయన శాస్త్ర విభాగ ఫ్యాకల్టీని అభినందించారు. విశ్వవిద్యాలయ కంట్రోల్ అఫ్ ఎక్సమినేషన్ డా. సురేష్,సైన్స్ అధ్యాపకులు డా. కోటరాజు, డా. దోసారపు విజయ్ కుమార్, డా. మల్లారెడ్డి, మధు, సురేష్ వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.