calender_icon.png 24 February, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27, 28 తేదీలలో ప్రొడక్షన్ డిజైన్‌పై వర్క్‌షాప్

23-02-2025 11:12:24 PM

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఈ నెల 27, 28 తేదీలలో రవీంద్రభారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ప్రొడక్షన్ డిజైన్‌లో రెండ్రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ బ్రోచర్‌ను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. అనంతరం మామిడి హరికృష్ణ మాట్లాడుతూ...సినిమా కథనం ద్వారా ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసేలా విజువల్ లాంగ్వేజ్‌ను రూపొందించే ప్రాసెస్ ప్రొడక్షన్ డిజైనింగ్ అని అన్నారు. ఇది ప్రొడక్షన్ డిజైన్ ద్వారా విజువల్ వండర్స్‌ను క్రియేట్ చేయడంతో పాటు సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రొడక్షన్ డిజైన్ కోర్సు ద్వారా సెట్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, లైటింగ్, ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ విలువలు తదితర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఫిల్మ్ మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.