calender_icon.png 1 April, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడి పశువుల పెంపకంపై వర్క్ షాప్

27-03-2025 12:18:03 AM

 రాజేంద్రనగర్, మార్చి 26 (విజయక్రాంతి): పశువైద్య విస్తరణ విభాగం, పశు వైద్య కళాశాల రాజేంద్రనగర్ వారి ఆధ్వర్యంలో పాడిపశువుల రంగంలో ఐసిఆర్, పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించిన వివిధ ఆవిష్కరణలపై బుధవారం ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో పాడి పశువుల పెంపకంలో క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటిని అధిగమించడానికి ఐసిఆర్ మరి యు పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించిన వివిధ ఆవిష్కరణలపై కులంకుశంగా చర్చించి వాటిని రైతులకు ఏ విధంగా చేరవేర్చాలో రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేశారు.

ఇంటర్నెట్ ను ఉపయోగించి పశుసంపద గురించి కావలసిన సమాచారాన్ని రైతులకు చేరవేర్చడానికి రూపొందించిన వివిధ మోడ్యుల్స్ ని గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ శరత్ చంద్ర, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీ డాక్టర్ ఉదయ్ కుమార్, పరిశోధక సంచాలకులు డాక్టర్ సిహెచ్ హరికృష్ణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ కిషన్ కుమార్, పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మాధురి, ఈ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.