calender_icon.png 23 September, 2024 | 10:55 AM

అమెరికా నుంచి 297 కళాఖండాలు

23-09-2024 02:23:08 AM

మోదీ పర్యటనలో కుదిరిన ఒప్పందం

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: భారత ప్రధాని క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన 297 కళాఖండాలను తిరిగి అప్పగించేందుకుఅమెరికా అంగీకరించింది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కళాఖండాలను అప్పగిస్తున్నం దుకు ప్రధాని మోదీ అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణాని నిరోధిస్తుందని ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2024, జూలైలో ఢిల్లీలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువులను తిరిగి రప్పించడంపై భారత్ మధ్య ఒప్పందం కుదిరింది.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు అమెరికా నుంచి 578 వస్తువులు వచ్చాయి. 2004 నుంచి 2013 వరకు కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో కేవలం ఒక్క వస్తువు మాత్రమే తిరిగొచ్చింది. కాగా 2021 మోదీ అమెరికా పర్యటనలో 157 వస్తువులు, 2023లో 105 వస్తువులు ఇండియాకు రాగా, తాజాగా 297 వస్తువులు వస్తున్నాయి.