calender_icon.png 22 April, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకిత భావంతో పనిచేస్తే గుర్తింపు తథ్యం

21-04-2025 12:00:00 AM

డాక్టర్ రవి బాబుకు అంబేద్కర్ ఎక్స్లెన్సీ అవార్డు 

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 20 (విజయ క్రాంతి):  కోసం పాకలాడ కుండా, సేవా భావంతో, అంకిత భావం కలిగి పని చేస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీహెచ్‌ఎస్ డాక్టర్ గూగులోత్ రవిబాబు రుజువు చేశా రు. వివిధ  రంగాల్లో రాణిస్తూ నిరుపేదల అభ్యున్నతికి పాటుపడుతున్న వారికి అందిం చే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు రవిబాబు సొంతం కావడం ఆయన పనితీరుకు నిదర్శనం.

ఈనెల 17న రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, దైవజ్ఞశర్మల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. గిరిజన జిల్లాగా పేరేందిన భద్రాద్రి కొత్తగూ డెంలో రోగులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వెళ్లే పరిస్థితి ఉండేది.

ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి జిల్లాలోని అన్ని రకాల స్పెషలిస్ట్ సేవలు, 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు, మెటర్నటీ కంటి ఆపరేషన్లు ,ఎండోస్కోపిక్, సైనస్ సర్జరీ లాంటి అత్యాధునిక వైద్య సేవలు, డయాలసిస్ సేవలు అందుబాటులోకి తేవడానికి రవిబాబు కీలక పాత్ర పోషించారు. 2018 లో సర్వీస్ లో చేరిన తర్వాత ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేసి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీవీవీపి అజయ్ కుమార్ ల ప్రశంసలు అందుకొన్నారు.

గత ఆరు సంవత్సరాలుగా ప్రతి కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ వైద్యాధికారిగా, ఉత్తమ అధికారిగా ప్రశంసా పురస్కారాలు దక్కా యి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఒకటి, రెండు దశల్లో ముం దుండి జిల్లా యంత్రాంగా నడిపి అనేక మం ది ప్రాణాలు కాపాడి జిల్లా ప్రజల మన్ననలు పొందారు. ఆయన చేసిన సేవా కార్య క్రమాలను గుర్తించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు అతని సొంతమైంది.