నల్లమల పర్యటనలో మంత్రి సీతక్క
అచ్చంపేట, డిసెంబరు 1: నల్లమల ప్రాంతంలోని ఐటీడీఏను అన్నివిధాలా అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివా రం శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని మ ల్లెలతీర్థం, పాతాలగంగ ప్రాంతంలోని విద్యు త్ కేంద్రంలో పర్యటించారు.
చెంచులు, ఆదివాసీలు నివసించే ఐటీడీఏను బలోపేతం చే సేందుకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈ ప్రాంత సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లార ని తెలిపారు.
మల్లెలతీర్థం ప్రాంతానికి త్వర లో బీటీరోడ్డు నిర్మాణం కోసం నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపారు. అంతకు ముందు పాతాళగంగ ప్రాంతంలోని భూగర్భజల విద్యుత్ కేంద్రంలోని అధికారులతో మం త్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమెవెంట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు.