19-03-2025 11:34:36 PM
చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్..
కోదాడ (విజయక్రాంతి): కోదాడ పట్టణ లక్ష్మీపురంలో బుధవారం వ్యవసాయం మార్కెట్ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని కమిటి చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ... మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూచనలు సలహాలు సహకారంతో మార్కెట్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్ ద్వారా నియోజకవర్గంలో ఉన్న మండలంలో మండలానికి ఒక రోజు చొప్పున పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
పశువులకు పరీక్షలు చేయించి సంబంధిత డాక్టర్ ల తో కావలసిన మందులు రైతులకు అందిస్తున్నామన్నారు. రైతులు వ్యాపారస్తులు నేరుగా పశువుల సంతలోనే అమ్మకాలు కొనుగోలు వ్యాపారాలు చేసుకోవాలన్నారు. అందరూ సహకరిస్తేనే సంతకు పూర్వం వస్తుందని సంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బషీర్ మెంబెర్స్ మల్లు వెంకట్ రెడ్డి రాపాలి శ్రీను గ్రేడ్ వన్ రాహుల్ నాయకులు సైదాబాబు డాక్టర్ పెంటయ్య పాల్గొన్నారు.