calender_icon.png 13 January, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి కృషి

13-01-2025 02:52:43 AM

పీఆర్‌టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి 

హైదరాబాద్, జనవరి 12(విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పీఆర్‌టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నారాయణ గూడలోనే యూనియన్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాను సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 30 శాతం పీఆర్‌ఎసీ, 61ఏళ్ల వయోపరిమితి పెంపు కోసం కృషి చేశానని, ఎమ్మెల్సీగా గెలిపిస్తే హెల్త్ కార్డులను అందించడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేయిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న శ్రీపాల్ రెడ్డి, మహేందర్‌రెడ్డిలకు పీఆర్‌జీటీఏ మద్దతు తెలిపింది.

కార్యక్రమంలో పీఆర్‌జీటీఏ అధ్యక్షుడు వేంరెడ్డి దిలీప్ రెడ్డి, పీఆర్‌టీయూటీఎస్ జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, నరేశ్, వేణుప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.