calender_icon.png 19 April, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమానికి కృషి

07-04-2025 12:32:25 AM

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్

 సదాశివపేట , ఏపిల్ 6: సదాశివపేట మండలానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు 10,89,500 రూపాయలకు సదాశివపేట పట్టణానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు,6,22000 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సదాశివపేటలో ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడమైనది, ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ... ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి వస్తే నిరుపేద కుటుంబాలకు నా వంతు సహకారం చేస్తానని  వైద్య ఖర్చుల నిమిత్తము వైద్యం చేయించుకోలేనటువంటి పేదల కు అండగా నేనెప్పుడూ ఉండి అట్టి హాస్పిటల్ ఖర్చులకు ప్రభుత్వం నుండి సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ రత్నాకర్ రెడ్డి ,పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పెద్దగొల్ల ఆంజనేయులు, హరిఫుద్దీన్ , పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లోడి వీరేశం ,మాజీ ఎంపీపీ తొంట యాదమ్మ, కిష్టయ్య ,మాజీ ఎంపీటీసీలు మాధవరెడ్డి ,సునీత ,సుధాకర్, సంతోష్ గౌడ్ ,మాజీ కౌన్సిలర్లు చౌదరి ప్రకాష్, మోబిన్, సాతాని శ్రీశైలం, ఇంద్రమోహన్ గౌడ్ ,సమీ, కలీం పటేల్ ,నసీరుద్దీన్, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు నగేష్, పెద్దగొల్ల శ్రీహరి, సిద్ధన్న , కుమార్, హనుమంత్ రెడ్డి ,మణయ్య  బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.