రాష్ట్ర జైళ్ల శాఖ డీసీ సౌమ్య మిశ్రా
కాప్రా, డిసెంబర్ 6: కేంద్ర కారాగారంలో ఖైదీల సంక్షేమానికి సంస్కరణ లు చేపట్టి ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు ప్రభుత్వం, జైళ్ల శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర జైళ్ల శాఖ డీసీ సౌమ్యమిశ్రా పేర్కొన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో శుక్రవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఖైదీలకు బ్యాడ్‌మెంటన్, వాలీబాల్, చదరంగం క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. దేశవ్యాపంగా ఐఓసీఎల్ ఆధ్వర్యంలో 14 రాష్ట్రాల్లోని జైలల్లో ఎంపిక చేసిన 2,500 మంది ఖైదీల కోసం క్రీడా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఐఓసీఎల్ హెచ్‌ఆర్ హెడ్ అజేయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఖైదీలకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చేందు కు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీ అడ్మిన్ వై.రాజే శ్, ఐజీ వేల్ఫేర్ మురళిబాబు, హైదరాబాద్ రేంజ్ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, వరంగ ల్ రేంజ్ ఐజీ సంపత్, చర్లపల్లి జైలు సూపరింటిండెంట్ రామచంద్రం, డి ప్యూటీ సూపరింటిండెంట్లు శశికాంత్, శ్రీనునాయక్, రత్నం పాల్గొన్నారు.