calender_icon.png 3 April, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీల సంక్షేమానికి కృషి

28-03-2025 02:01:46 AM

సుల్తానాబాద్ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే విజయరమణ రావు

మంథని, మార్చి 27 (విజయ క్రాంతి): ముస్లిములు, మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మంటపంలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని గురువారం ముస్లిం సోదరులకు  ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అధికారిక ఇఫ్తార్ విందు నిర్వహించారు.

తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్నందున ఈ కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోయానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామరస్యానికి, సోదర భావానికి ప్రతీక రంజాన్ అని ఎమ్మెల్యే కొనియాడారు. సుల్తానాబాద్ ట్టణంలో  నిర్వహించిన ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ సోదరులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.