calender_icon.png 22 April, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

22-04-2025 12:35:46 AM

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి 

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి) రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి లతో మర్యాదపూర్వకంగా కలిశారు.

సందర్భంగా అక్కడి జర్నలిస్టులతో మాట్లాడారు.జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు త్వరలోనే జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అంశంపై ప్రభుత్వంతో చర్చించామని ప్రభుత్వంసానుకూలంగా  స్పందించిందని తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు విజయ్ కుమార్ , సాయిలు సాగర్, యాదగిరి, మాధవరెడ్డి, మోహన్, ధర్వేష్, రాంప్రకాష్, బాదం పరమేష్  తదితరులు పాల్గొన్నారు