20-03-2025 12:13:49 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మార్చి 19 : క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలోని వివిధ చర్చిలకు మంజూరు చేసిన రూ.5లక్షల విలువైన చెక్కులను బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చి ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనివార్య కారణాల మూలంగా చెక్కుల పంపిణీ ఆలస్యం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుండి మంజూరైన ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ రంగా రావు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా చర్చిల ప్రతినిధులు పాల్గొన్నారు.