28-02-2025 07:22:28 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ పరిధిలో గల వడ్డుగూడెం గ్రామంలో ఉన్న అంగన్వాడి, ఎంపీపీ ఎస్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూక్య వెంకటేష్, గ్రామ యూత్ నాయకులు చింత కళ్యాణ్ అన్నారు. శుక్రవారం వడ్డుగూడెం గ్రామంలోని అంగన్వాడీ, ప్రైమరీ పాఠశాలను సందర్శించి పరిసరాల పరిశుభ్రం కార్యక్రమం చేపట్టారు. పాఠశాల అవణంలో ఉన్న మొక్కలకు నీరు పోశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు పూనేం నాగేశ్వరరావు, మొక్కటి వెంకటరామయ్యలను శాలువతో సత్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సంజీవ్, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.