కాప్రా, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ తో కలిసి కాప్రా సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరి స్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ జగన్, ఇంజినీరింగ్ ఎస్‌ఈ ఆశోక్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.