ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
రాజేంద్రనగర్, అక్టోబర్ 29: శంషాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం శంషాబాద్ మున్సిపల్ భవనంలో చైర్పర్సన్ సుష్మా మహేందర్రెడ్ది ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మున్సిపా లిటీకి ఇప్పటివరకు రూ.కోట్లలో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత కౌన్సిల్ సమావేశంలో రూ.5 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుకున్నట్లు వివరించారు. అనంతరం కౌన్సిలర్లు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు పాల్గొన్నారు.