15-10-2024 12:08:44 AM
కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొనగాల మహేశ్
మానకొండూర్, అక్టోబర్ 14 : మున్నూరుకాపుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేశ్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో మున్నూరుకాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం మున్నూరుకాపుల అభివృద్ధికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. తాను పుట్టిన మండలంలో అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పురంశెట్టి బాలయ్య, బొడ్డు సునీల్, బొడ్డు బాలయ్య, ప్రకాశ్, నగేశ్, నర్సయ్య, రాము, కనకయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.