మీ కుటుంబ అండగా నేనున్నా.. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
మంథని (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ఎవరు అధైర్య పడొద్దు...మీ కుటుంబాలకు అండగా నేనున్నా అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్ జి-1 జిఎం లలిత్ కుమార్ కు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సూచించారు. రామగుండం జీడీకే ఓసి-5 లో గత రెండు రోజుల క్రితం క్యాంటీన్ విషయమై తలెత్తిన సమస్యపై ఎమ్మెల్యే కు, సిఎండి కి ఫిర్యాదు చేసిన లెటర్ లో స్థానిక కార్మికులు సంతకాలు చేసినందుకు అధికారులు కార్మికులకు నోటీసులు జారీ చేశారు.
మీరు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఫిర్యాదు చేస్తారా... అంటూ నాయకులను, పలువురు కార్మికులపై చర్యలు తీసుకుంటామని గని మేనేజ్మెంట్ బెదిరింపులకు పాల్పడుతుందని ఆదివారం ఐఎన్టియుసి నాయకులు జనగామ శ్రీనివాస్ గౌడ్, అరగంటి కృష్ణ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను కలిసి వినతి పత్రం ఇస్తూ వారి సమస్యని తెలియజేశారు. హైదరాబాద్ లో వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఆర్జీ-1 జిఎం తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. కార్మికుల ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని కార్మికులకు ఇచ్చిన నోటీసులు వెంటనే రద్దు చేయాలని గని మేనేజ్మెంట్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.