calender_icon.png 10 January, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు అస్సాంలో ఘటన

07-01-2025 12:36:39 AM

న్యూఢిల్లీ, జనవరి 6: అస్సాంలోని దిమా హాసో జిల్లాలో  300 అడుగుల లోతైన ర్యాట్ హోల్ బొగ్గు గనిలో 18 మంది కార్మికులు చిక్కుకున్నారు. మేఘాలయకు దగ్గర్లో ఉన్న ఈ గనికి ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది. దాదాపు 100 అడుగుల వరకు గని నీటితో నిండిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ దళాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. 

ఆర్మీని అభ్యర్థించాం: హిమంత

ఈ ప్రమాదంపై సీఎం హిమంత బిస్వ శర్మ స్పందించారు. ‘మేము ఆర్మీ సాయాన్ని కూడా అభ్యర్థించాం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. 2018లో కూడా మేఘాలయాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది.