సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలో పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టెండర్ గడువు ముగిసి నెల కావస్తున్న కొత్త టెండర్ పిలవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే సింగరేణి వ్యాప్తం ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు వికాస్, సంపత్, శ్రీధర్, మల్లేష్, రమేష్, గోపాల్, దినేష్, శ్రీనివాస్, మహేష్, బిక్షపతి, శంకర్, కె. శ్రీనివాస్, కృష్ణకాంత్, తిరుపతిలు పాల్గొన్నారు.