calender_icon.png 19 March, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎదుట కార్మికుల నిరసన..

05-03-2025 05:38:15 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన దిగారు. ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. దుర్గనగర్ లో జవాన్ ఆనంద్ తో పాటు పారిశుద్ధ్య కార్మికులపై దాడికి పాల్పడ్డ గోవింద్, ఆయన కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపటి నుండి విధులు బహిష్కరించి, న్యాయం చేసేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చెప్పడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంతారావు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.