calender_icon.png 4 March, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక శాఖ కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన

04-03-2025 03:56:52 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని కోరుతూ ఐఎఫ్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ(IFTF District General Secretary Venkata Narayana) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కార్మిక శాఖ కార్యాలయం(Adilabad Labor Department Office) ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యంరెడ్డి(Assistant Labour Commissioner Muthyam Reddy)కి 18 సమస్యలతో కూడిన మెమోరాండం ను అందజేశారు.