calender_icon.png 16 April, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులు చైతన్యవంతం కావాలి

14-04-2025 10:43:17 PM

మందమర్రి (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా కార్మికవర్గం చైతన్య వంతం కావాలని సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ఆన్నారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ ఆద్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కార్మికులకు నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న లేబర్ కోఢ్ లపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పాలకులు కార్మికులను విడదీయడానికి కులమతాల చిచ్చు పెడుతున్నారని కార్మికులు ఈ గొడవలో ఉండగా ప్రభుత్వం యాజమాన్యాలు కలిసి కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలను తీసుకువచ్చి బడా పెట్టుబడిదారులకు లాభాలను తెచ్చిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

దీనిలో భాగంగానే జాతీయ సంపద అయిన బొగ్గును ప్రైవేటు వారికి అప్పజెప్పేల వేలం పాటలను తీసుకురావడంలో విజయవంతం అయ్యారన్నారు. కార్మికులు ఎప్పటికప్పుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా చైతన్యవంతమై ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టి ఐక్యంగా కార్మిక సంఘాలను బలోపేతం చేయాలన్నారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శి ఉపకార్యదర్శులు రాజారెడ్డి, మంద నరసింహారావు, నాగరాజు గోపాల్ లు మాట్లాడుతూ... సింగరేణిలో ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయని, కార్మిక వర్గం తమ వంతు బాధ్యతగా కష్టపడి పనిచేస్తు సంస్థను కాపాడుకోవాలన్నారు. అధికారులు కూడా రాజకీయ నాయకులను ప్రోత్సహించ కుండా కష్టపడి పని చేస్తున్న కార్మికుల మంచి చెడులు చూసుకోవాలని గుర్తింపు ప్రాథమిక సంఘాల నాయకులు యాజమాన్యానికి ప్రభుత్వానికి లొంగకుండా సింగరేణి కార్మికుల హక్కులు కాపాడుతూ సంస్థకు భవిష్యత్తును పెంపొందించాలని సూచించారు.

వచ్చేనెల 20న జరిగే దేశ వ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేసేలా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అన్ని యూనియన్లతో జేఏసీ ఏర్పాటు చేసి సమ్మె చేసీ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చెప్పాలన్నారు. ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టుల చేసి కార్మిక వర్గ ఐక్యతను చాటి చెప్పాలన్నారు. కోల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ నాయకులుగా ఎన్నికైన తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు, అల్లి రాజేందర్ లకు మేమేంటోళ్లు ఇచ్చి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏరియాలో పలు గనులకు చెందిన మైనింగ్ స్టాప్ తో పాటు యువ కార్మికులు కొత్తగా యూనియన్ లో చేరగా వారిని నాయకులు కండువాలు కప్పి వేజ్ బోర్డు పుస్తకాలు ఇచ్చి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకట స్వామి, ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య, అన్ని గనుల పిట్ సెక్రటరీలు, మైనింగ్ స్టాఫ్ సిబ్బంది,  పెద్ద ఎత్తున  కార్మికులు పాల్గొన్నారు.