calender_icon.png 11 March, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుడి మృతిని ప్రమాదంగా గుర్తించాలి

11-03-2025 12:34:21 AM

మంచిర్యాల మార్చి 10 (విజయక్రాంతి) : జైపూర్ మండలంలోని ఐ కె 1ఎ మొదటి షిఫ్ట్ లో మ్యాన్ రైడింగ్ వద్ద విధులు నిర్వహిస్తు మృతి చెందిన పచునూరి రామచందర్ (31) జనరల్ మజ్దూర్ మృత దేహాన్ని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో సిఐటియు శ్రీరాం పూర్ బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ పరిశీలించి, మృతుడి కుటుంబాన్ని పరామ ర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురై  పూర్తిస్థాయిలో వైద్యం అందేలోపు చనిపో వడం చాలా దురదృష్టకర విషయమని, ఆయన మరణం పై తగిన విచారణ జరిపిం చాలని డిమాండ్ చేస్తూ, అనేక కోట్ల లాభా లు ఆర్జిస్తున్న సంస్థలో విధి నిర్వహణలో ఒక కార్మికుడు అస్వస్థతకు గురైతే వైద్యం అందించలేని స్థితిలో యాజమాన్యం ఉండడం సరైనది కాదని,   గెలిచిన సంఘాలు వైద్య సేవలపట్ల పూర్తిస్థాయి ఒప్పందాలు చేసుకోకపోవడం వల్లనే వైద్య సేవలు అందడం లేదన్నారు.

గని లోపల జరిగే మరణాలన్నింటిని గని ప్రమాదంగానే గుర్తిస్తూ, బ్యాంకుల ద్వారా చేసుకున్న ఇన్సూరెన్స్ ను కూడా వర్తింపజేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)గా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆయన వెంట సీనియర్ నాయకులు అలవాల సంజీవ్, ఆర్కె 7  ఫిట్ సెక్రటరీ శ్రీధర్ లు ఉన్నారు.