calender_icon.png 23 April, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీతాలు లేక కార్మికుల ఆందోళన

23-04-2025 12:50:40 AM

  1. ఏజెన్సీల ఇష్టారాజ్యం 
  2. దిక్కు తోచని స్థితిలో కార్మికులు

కల్వకుర్తి ఏప్రిల్ 22: కల్వకుర్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యో గులకు, కార్మికులకు జీతాలు అందలేదని కార్మికులు మంగళవారం పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.అవుట్ సోర్సింగ్‌ఉద్యోగులకు, కార్మికు లకు ఆదిత్య ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లించే పద్ధతి ఉండటంతో మార్చి నెల జీతాలు ఏజెన్సీ ద్వారా జమ చేయాల్సి ఉండగా నెలాఖరు వచ్చినా జీతాలు చెల్లించక పోవడంతో ఆందోళనకు దిగారు.

ఏజె న్సీ నిబంధల ప్రకారం మున్సిపల్ కార్యాల యం నుండి ఏజెన్సీకి డబ్బులు ఆలస్యం అయనప్పటికీ, మూడు నెలల వరకు కార్మికులకు ప్రతీ నెల జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఏజెన్సీకి ఉంటుంది. కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ ని వివరణ కోర గా ఆదిత్య ఏజెన్సీకి మొదటి వారంలోగా  కార్యాలయం నుండి చెక్ అందించామని తెలిపారు.