11-04-2025 01:10:52 AM
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : -కార్మికులే నిజమైన వారియర్స్ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గుగని, ఛత్తీస్‌గఢ్ కోర్బా ప్రాంతంలోని గెవరా గనిని ఆయన గురువారం సందర్శించారు.- గనిలో జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి అధికారులు కేంద్రమంత్రికి ప్రజెంటేషన్ రూపంలో వివరించారు.
అనంతరం స్వయంగా గనిలోకి దిగి బ్లాస్ట్ ఫ్రీ సర్ఫే స్ మైనర్ సాంకేతికత ద్వారా జరుగుతున్న బొగ్గు తవ్వకాలను కిషన్‌రెడ్డి ఆసక్తిగా గమనించారు.- ఫస్ట్ మైల్ కనెక్టివిటీ కార్యక్రమం ద్వారా పర్యావరణహితంగా జరుగుతున్న బొగ్గు రవాణాను పరిశీలించారు.- మెషీన్ ఆపరేటర్లను పలకరించిన కేంద్రమంత్రి యంత్రాల పనితీరుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
-దేశ ఇంధన భద్ర తను పరిరక్షించడంలో కీలకమైన బొగ్గుఉత్పత్తికి అహర్నిశలు కృషి చేస్తున్న కార్మికులు, మహిళా ఉద్యోగులను ఈసందర్భంగా ప్రశంసించారు. అనంతరం, కార్మికులతో కలసి సహపంక్తి భోజనం చేసి..వారితో కలిసి సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత -గెవరాలో మి యావాకి పద్ధతిలో పైలట్ ప్రాజెక్టులో చెట్ల ను పెంచిన ప్రదేశాన్ని సందర్శించారు. కార్మికులు, ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్మిం చిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. -
ఇంధన భద్రతలో బొగ్గే కీలకం..
దేశంలో ఇంధన భద్రత కల్పించడంలో బొగ్గు శాఖ కీలకపాత్ర పోషిస్తోందని, దేశంలోని విద్యుత్ అవసరాల్లో 70 శాతానికి పైగా బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోందని కేం ద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మైనింగ్ కార్యకలాపాల్లో సుస్థిరత సాధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, సరైన పద్ధతిలో ప్రణాళికా బద్ధంగా గనుల మూసివేత చేపడుతున్నామన్నారని తెలిపారు.
గెవరా గని దేశానికే తలమానికమని, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలోనూ ఈ గని కీలకపాత్ర పోషిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కోలిండియా లిమిటెడ్ చైర్మన్ పీఎం ప్రసాద్, బొగ్గు శాఖ జాయింట్ సెక్రటరీ బీపీ పాటిల్, ఎస్‌ఈసీఎల్ సీఎండీ హరీశ్ దుహాన్ తదితరులు పాల్గొన్నారు.